ఔరంగాబాద్ తండాలో స్వతంత్ర అభ్యర్థి గెలుపు.!

ఔరంగాబాద్ తండాలో స్వతంత్ర అభ్యర్థి గెలుపు.!

MDK: హవేలీ ఘనాపూర్ మండలం ఔరంగాబాద్ తండా సర్పంచ్‌గా కేతావత్ భూలి 160 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు పొందారు. స్వతంత్ర అభ్యర్థిగా అందరి మద్దతుతో బరిలో దిగిన భూలి విజయం సాధించడంతో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.