VIDEO: 'మహిళలందరికీ చీరలు పంపిణీ చేయాలి'
SRPT: ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకే కాకుండా రాష్ట్రంలోని మహిళలందరికీ చీరలు పంపిణీ చేయాలని BRS మండల అధ్యక్షుడు సీతయ్య డిమాండ్ చేశారు. ఇవాళ తుంగతుర్తిలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన విధంగానే రేషన్ కార్డులో పేరున్న ప్రతి మహిళకు చీరలు అందించాలన్నారు.