రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోంది: ఎమ్మెల్యే
KDP: ప్రొద్దుటూరు రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. ఆయన ఇవాళ స్థానిక ఎండీవో కార్యలయంలో 'PM కిసాన్ అన్నధాత సుఖీభవ' రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేనంతగా చంద్రబాబు రైతుల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని తెలిపారు.