భవిష్యత్‌పైనే నా దృష్టి: సీఎం చంద్రబాబు
AP: భవిష్యత్ తరాలకు సురక్షితమైన, అభివృద్ధి చెందిన ప్రపంచాన్ని అందించడమే తన కర్తవ్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. లండన్‌లోని ఐవోడీ పురస్కారాల ప్రదానోత్సవంలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా దూరదృష్టితో ప్రణాళికలు రచించడం, ప్రజల జీవితాలను మెరుగుపర్చడానికి టెక్నాలజీని ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగించుకోవడమే సుపరిపాలన లక్ష్యమన్నారు.