నూతన తూము కల్వర్ట్ నిర్మాణం పరిశీలన

కృష్ణా: అవనిగడ్డ మండలం దక్షిణ చిరువోలులంక ప్రధాన రహదారిలో తూము కల్వర్టు నిర్మాణం పూర్తయింది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ PMJSY నిధులు రూ. 3.60 కోట్లతో నూతన రోడ్డు నిర్మాణం, తూము కల్వర్ట్ నిర్మాణం చేపట్టారు. కల్వర్ట్ నిర్మాణం పూర్తి కాగా శుక్రవారం నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, పీఆర్ ప్రాజెక్టు ఏఈ భరద్వాజ, గ్రామస్థులు పరిశీలించారు.