ఏ రంగంలోనైనా చర్చకు సిద్ధం: కాకాణి
AP: వ్యవసాయశాఖలను మంత్రి అచ్చెన్నాయుడు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. రైతుల గురించి పట్టించుకోకుండా విదేశాలకు వెళ్లారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు వీధి రౌడీలా మాట్లాడుతున్నారని విమర్శించారు. అచ్చెన్న సవాల్‌కు తాము సిద్ధమన్నారు. పంట నష్టంపై చంద్రబాబు మాట్లాడడంలేదని తెలిపారు. అన్ని రంగాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.