మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్

మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్

VZM: 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించి 30% మధ్యంతర భృతి ప్రకటించాలని ఫ్యాప్టో నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు దశలవారీ పోరాటంలో భాగంగా విజయనగరంలోని పీఎస్‌ఆర్ పాఠశాలలో ఉన్న పదవ తరగతి స్పాట్ మూల్యాంకన కేంద్రం వద్ద గురువారం ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. పీఆర్సీ ఇప్పటికే మూడు సంవత్సరాలు ఆలస్యమైందన్నారు.