శాశ్వత పరిష్కారం దిశగా సీసీ రోడ్ల నిర్మాణం
RR: హయత్ నగర్ డివిజన్‌లోని రంగనాయకుల గుట్ట కాలనీలో జరుగుతున్న నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను తాజా మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని పరిశీలించి పనుల నాణ్యతపై అధికారులతో చర్చించారు. ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలనే ఉద్దేశంతో సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామన్నారు.