ఆందోళనకు దిగిన మామిడి రైతులు
చిత్తూరు: జిల్లా వేంగారెడ్డి పల్లిలోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీ యాజమాన్యం మామిడి రైతుల డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు ఇవాళ ఆందోళన చేపట్టారు. తమకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించకపోతే న్యాయం జరిగేంత వరకు నిరసన కొనసాగిస్తామని రైతులు తెలిపారు. ఫ్యాక్టరీలకు మామిడి తరలించి ఏడాది పూర్తయినా డబ్బులు అందలేదని రైతులు అవేదన వ్యక్తం చేశారు.