VIDEO: 'క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి'
HNK: జిల్లా ముల్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్షతగాత్రులను పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ MGM హాస్పిటల్లో పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, క్షతగాత్రులకు అందిస్తున్న చికిత్స వివరాలను అధికారులను, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.