డ్రగ్స్ తయారీ కేంద్రంపై తెలంగాణ పోలీసులు దాడి

డ్రగ్స్ తయారీ కేంద్రంపై తెలంగాణ పోలీసులు దాడి

NDL: నందికొట్కూరులో డ్రగ్స్ తయారీ కేంద్రంపై తెలంగాణ నర్కోటిక్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో డ్రగ్స్ తయారు చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసు అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా అల్ఫ్రాజోలమ్ డ్రగ్ తయారు చేసినట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం డ్రగ్స్ తయారీ పరికరాలను పోలీసులు జప్తు చేశారు.