'మట్టి వినాయకుని పూజించి పర్యావరణాన్ని కాపాడాలి'

'మట్టి వినాయకుని పూజించి పర్యావరణాన్ని కాపాడాలి'

AKP: మట్టి వినాయకుని పూజించాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ తెలిపారు. మునగపాక గ్రామంలో మంగళవారం వినాయక చవితి సందర్భంగా 500 మట్టి వినాయకుని ప్రతిమలను పంపిణీ చేశారు. మట్టి వినాయకుని పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడిన వారవుతామన్నారు. పర్యావరణాన్ని కాపాడే యజ్ఞంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.