మార్కెట్లో రూ.8 వేలకు చేరిన పత్తిధర
KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో గత కొంతకాలంగా మందకొడిగా సాగుతున్న పత్తి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. చాలా రోజుల నిరీక్షణ తర్వాత క్వింటాల్ పత్తి ధర గురువారం రూ. 8,000 మార్కును తాకింది. బుధవారం రూ. 7,900 పలకగా నేడు రూ. 100 పెరిగి రూ. 8,000కు చేరుకుంది. పత్తి దిగుబడి తగ్గిన సమయంలో ధర పెరగడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.