మచిలీపట్నంలో శ్రీ సత్యసాయి జయంతి వేడుకలు
కృష్ణా: జిల్లాలో యభగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకలను ఇవాళ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మచిలీపట్నం ఈడేపల్లిలోని శ్రీ సత్యసాయి సేవా సమితి కార్యాలయంలో సాయంత్రం 5 గంటలకు జిల్లాస్థాయి వేడుకను జరపనున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో బాబావారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కలెక్టర్ కోరారు.