పరిటాల రవీంద్ర జయంతి సందర్భంగా వైద్య శిబిరం

పరిటాల రవీంద్ర జయంతి సందర్భంగా వైద్య శిబిరం

సత్యసాయి: రామగిరిలో పరిటాల రవీంద్ర జయంతి సందర్భంగా పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి బెంగళూరులోని ఎం.ఎస్. రామయ్య ఆసుపత్రి వైద్యులు సహకరించగా.. ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు విస్తృతంగా హాజరై లబ్ధి పొందారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు.