బాపులపాడులో అభివృద్ధి పనులు

కృష్ణా: బాపులపాడు మండలంలో వేగవంతమైన రోడ్ల అభివృద్ధి పనులు చేస్తున్నారు. మండలంలోని శోభనాద్రిపురం గ్రామంలో కొన్నాళ్లుగా మట్టి రోడ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు విముక్తి కలిగింది. స్థానిక గ్రామంలోని అన్ని మట్టి రోడ్లకు సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. దీంతో ఇక్కడ ప్రజలు, వాహనదారులు సంతోషం వ్యక్తం చేశారు.