అక్రమంగా ఇసుక తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
KNR: శంకరపట్నం మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ఓ బొలెరో వాహనాన్ని పట్టుకున్నట్లు ఎస్సై శేఖర్ తెలిపారు. వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన అలకుంట్ల వెంకటేష్ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా ముత్తారం గ్రామ శివారులో పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.