రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
అన్నమయ్య: రాజంపేట మండలంలోని కొత్త బోయినపల్లి ఇసుకపల్లి క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్ లారీ ఢీకొనడంతో గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న మన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.