VIDEO: ఎస్సై వేధింపులు తాళలేక మహిళ మృతి
SRPT: జిల్లాలోని తుంగుతుర్తిలో ఎస్సై వేధింపులు తాళలేక సోమనర్సమ్మ అనే మహిళ మృతి చెందిన ఘటన వెంపటిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గత 15 రోజుల క్రితం ఇంట్లో బంగారం పోయిందని తన బావ మల్లయ్య సోమనర్సమ్మపై ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో సోమనర్సమ్మను ఎస్సై క్రాంతికుమార్ వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆవేదనకు గురై ఉరేసుకుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.