VIDEO: అమ్మవారి ఆలయ నిర్మాణానికి లక్ష విరాళం
కోనసీమ: పి. గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ నిర్మాణానికి గ్రామానికి చెందిన హైకోర్టు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ యన్నపు యేసు రత్నం, లలితమ్మ కుటుంబ సభ్యులు రూ. 1,00,116 విరాళాన్ని ఆదివారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గ్రామస్తులు, ఆలయ పునః నిర్మాణ కమిటీ సభ్యులు దాతలను సత్కరించారు.