లబ్ధిదారులకు CMRF చెక్కులు అందజేత
SRD: నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సోమవారం లబ్ధిదారులకు CMRF చెక్కులను అందజేశారు. సిర్గాపూర్ మండలం పోచాపూర్ గ్రామానికి చెందిన చాకలి చిన్న దత్తు వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ. 17,000 చెక్కును, అలాగే నిజాంపేట్ మండలం బాచేపల్లికి చెందిన గైని గంగమణికి రూ. 13,500 చెక్కును ఆయన పంపిణీ చేశారు. పేదలకు CMRF నిధులు ఎంతో భరోసానిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.