'ప్రభుత్వ ఆసుపత్రిలో బయోమెట్రిక్ అమలు చేయాలి'

'ప్రభుత్వ ఆసుపత్రిలో బయోమెట్రిక్ అమలు చేయాలి'

SDPT: ప్రభుత్వ ఆసుపత్రులలో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కె. హేమావతి ఆదేశించారు. సోమవారం ఉదయం ప్రజావాణి కార్యక్రమానికి ముందు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం అంశాలపై సమీక్షించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు హాజరు విషయంలో లోటుపాట్లు గుర్తించినట్లు తెలిపారు.