దివ్యాంగ విద్యార్థికి ల్యాప్‌టాప్ అందించిన కలెక్టర్

SRD: మనిపల్లి మండలం కంకోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో 86% ఫలితాలు సాధించిన దివ్యాంగుడు మధు కుమార్‌కు కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం ల్యాప్‌టాప్ అందజేశారు. ఐదవ తరగతి చదివే సమయంలో విద్యుత్ ఘాతంతో కాళ్లు కోల్పోయిన కష్టపడి చదివి పదిలో మంచి మార్కులు సాధించారు. కార్యక్రమంలో డీఈవో వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయులు తుకారం పాల్గొన్నారు.