ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
PLD: నరసరావుపేటలోని కేసనపల్లి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బరంపేటకు చెందిన చందు(25) అనే యువకుడు మృతి చెందగా, ఇంకో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని 108 అంబులెన్స్ సహాయంతో నరసరావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.