ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని పరిశీలించిన ఎంపీడీవో

ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని పరిశీలించిన ఎంపీడీవో

WGL: పర్వతగిరి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని మంగళవారం ఎంపీడీవో శంకర్ నాయక్ పరిశీలించారు. ఇప్పటి వరకు 14 మంది లబ్ధిదారులు స్లాబ్ దశను పూర్తి చేయగా, RL లెవల్లో 24 మంది పూర్తి చేశారన్నారు. లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రఘు, లబ్ధిదారులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.