నగలు తెంపుకెళ్లిన దుండగులు.. కేసు నమోదు

VZM: బాడంగి మండలం గొల్లది గ్రామానికి చెందిన వంగపండు పుష్ప అనే మహిళ, గొల్లాది నుంచి రామభద్రపురానికి స్కూటీపై వస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు తెంపడంతో స్పృహ కొల్పోయి కింద పడిపోయింది. కిందపడిన తర్వాత ఆమె చెవిదుద్దులు కూడా తెంపుకుని దుండగులు పరారయ్యారు. అనంతరం ఆమె పోలీసులకు పిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.