శాకంబరీగా కన్యకా పరమేశ్వరి అమ్మవారు

కాకినాడ: ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న పిఠాపురం పట్టణంలో కోటగుమ్మం సెంటర్‌లో కొలువైయున్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శనివారం శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాడమాసం సందర్భంగా వాసవి అమ్మవారిని వివిధ రకాల కాయగూరలతో అలంకరించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.