'బీహార్‌‌లో తొలగించిన ఓట్లను చేర్చాలి'

'బీహార్‌‌లో తొలగించిన ఓట్లను చేర్చాలి'

WNP: బీహార్‌లో తొలగించిన సుమారు 64 లక్షల ఓట్లను తిరిగి చేర్చాలని CPM పట్టణ కార్యదర్శి పరమేశ్వర చారి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వనపర్తి అంబేద్కర్ చౌక్‌లో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా చారి మాట్లాడుతూ.. బీహార్‌లో ఉన్న ముస్లిం, మైనార్టీ, ప్రతిపక్ష పార్టీల ఓట్లను తొలగించి అడ్డదారిలో అధికారం చేపట్టాలని బీజేపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు.