కొమరాడ పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
PPM: పార్వతీపురం గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న కొమరాడ పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు పర్యవేక్షించి,వాటి పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అపరిష్కృతంగా కేసులపై ఆరా తీశారు. స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల మర్యాదగా మెలగాలని సూచించారు.