వైభవంగా గోదాదేవి సారె ఊరేగింపు కార్యక్రమం

వైభవంగా గోదాదేవి సారె ఊరేగింపు కార్యక్రమం

VZM: గజపతినగరంలో గోదాదేవి సారె ఊరేగింపు కార్యక్రమం మంగళవారం వైభవంగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు పీసపాటి శ్రీనివాసచార్యులు ఆధ్వర్యంలో గోదాదేవి ఉత్సవ విగ్రహాన్ని, సారెను ప్రధాన వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.