మనుబోలులో వైభవంగా వీరభద్రస్వామి కళ్యాణం
NLR: మనుబోలులో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి కళ్యాణం మంగళవారం రాత్రి కనులు పండువగా జరిగింది. అర్చకులు శ్రీనివాసులు వేదమంత్రాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. ప్రతిఏటా కార్తీకమాసంలో కళ్యాణం చేయడం ఆనవాయితీగా వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కళ్యాణానికి ఉభయ దాతలుగా భాగవతల విజయ రాఘవేంద్ర, శైలజమ్మ , మందాటి విమల్, నిఖిల దంపతులు వ్యవహరించారు.