VIDEO: రేషన్ లబ్ధిదారులకు సంచులు పంపిణీ
SRPT: నడిగూడెం మండలంలోని సిరిపురంలో ఈ రోజు రేషన్ దుకాణం ద్వారా లబ్ధిదారులకు సన్న బియ్యంతో పాటు పర్యావరణ రహిత చేతి సంచులను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా సన్నబియ్యం, సంచులు అందించడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రేషన్ కార్డుపై ఒకటి చొప్పున సంచులు పంపిణీ చేసినట్లు డీలర్ వీ.సావిత్రి తెలిపారు.