పేకాటరాయుళ్లు ఏడుగురి అరెస్ట్

పేకాటరాయుళ్లు ఏడుగురి అరెస్ట్

EG: పెద్దాపురం మండలం వాలు తిమ్మాపురంలో ఆదివారం రాత్రి పేకాట ఆడుతున్నారనే సమాచారంతో ఎస్సై మౌనిక తన సిబ్బందితో దాడులు చేపట్టారు. ఈ దాడులలో భాగంగా ఏడుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ. 9, 600 నగదు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఎవరైనా జూద క్రీడలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.