చీరాలలో సైబర్ మోసం
BPT: చీరాలలో సైబర్ మోసం కలకలం రేపింది. విశ్రాంత వైద్యుడికి కేటుగాళ్లు ఫోన్ చేసి మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్నావని బెదిరించారు. అలా నమ్మబలికి పలు దఫాలుగా రూ.1.10 కోట్లు తమ ఖాతాకు వేయించుకున్నారు.మోసాన్ని గ్రహించిన బాధితుడు శనివారం చీరాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సుబ్బారావు తెలిపారు.