'అబ్బుర పరిచేలా ప్రాంగణ పునర్నిర్మాణం'
MLG: సమ్మక్క, సారలమ్మ ప్రాంగణం పునర్నిర్మాణం పనులు ఈ ప్రాంత ప్రజలు, భక్తులు, పర్యాటకు లను అబ్బుర పరిచేలా ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. తాడ్వాయి మండలంలోని మేడారంలో గురువారం మంత్రి పర్య టించారు. సమ్మక్క, సారలమ్మ, పగిడి ద్దరాజు, గోవిందరాజుకు పూజలు చేసిన అనంతరం ప్రాంగణంలో చేపడుతున్న నిర్మాణాలను పరిశీలించారు.