'మూట్ కోర్టులతో న్యాయ విద్యార్థులకు మేలు'
VSP: విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా డా. బి.ఆర్. అంబేద్కర్ న్యాయ కళాశాలలో నేషనల్ మూట్ కోర్ట్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. మూట్ కోర్ట్‌ల ద్వారా విద్యార్థులు న్యాయపరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చని తెలిపారు. దేశవ్యాప్తంగా 21 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయని ప్రిన్సిపల్ ఆచార్య సీతామాణిక్యం తెలిపారు.