నరసరావుపేట రైల్వే స్టేషన్‌లో వృద్ధుడి మృతి

నరసరావుపేట రైల్వే స్టేషన్‌లో వృద్ధుడి మృతి

PLD: నరసరావుపేట రైల్వే స్టేషన్‌లో గురువారం 65-70 ఏళ్ల వయసు గల గుర్తుతెలియని వృద్ధుడు గుండెపోటుతో మృతి చెందాడు. బుకింగ్ కౌంటర్ వద్ద కూర్చుని ఉండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించామని, మృతుని వివరాలు తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.