వర్షానికి నేలకొరిగిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు

వర్షానికి నేలకొరిగిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు

కోనసీమ: సఖినేటిపల్లిలో ఆదివారం కురిసిన గాలివానకు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గాలికి పలు ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరిగాయి. విద్యుత్ తీగలపై చెట్లు పడడంతో తీగలు తెగిపడి విద్యుత్ సరఫరా ఆగింది. దీంతో ఉదయం నుంచి విద్యుత్ లేక కొన్ని గ్రామాలు అల్లాడుతున్నాయి. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.