వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే
WGL: నెక్కొండ మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో గురువారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. మెుంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన పంట వివరాలు సేకరించాల్సిందిగా అధికారులకు ఆదేశించారు.