VIDEO: రైతులు నాణ్యమైన పత్తిని మార్కెట్‌కు తీసుకురావాలి: కలెక్టర్
NRML: రైతులు నాణ్యమైన పత్తిని మార్కెట్ యార్డులకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. బైంసా మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు ప్రారంభం సందర్భంగా మాట్లాడుతూ, క్వింటాలుకు రూ.8,110 కనీస మద్దతు ధరగా నిర్ణయించారని తెలిపారు. జిల్లాలో 17 జిన్నింగ్ మిల్స్, 17 కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.