'ట్రాఫిక్ నియమాలు పాటించండి'

'ట్రాఫిక్ నియమాలు పాటించండి'

RR: షాద్‌నగర్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా పాలన’ కార్యక్రమంలో డీసీపీ శిరీష పాల్గొన్నారు. 'అరైవ్- అలైవ్' కార్యక్రమంపై అవగాహన కల్పించారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి అజాగ్రత్తల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టి, ప్రాణాలను రక్షించడమే దీని లక్ష్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షితంగా ఇంటికి చేరాలని తెలిపారు.