బయోమెడికల్ నిబంధనలు అమలు చేయాలి: కలెక్టర్
KRNL: బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో ఖచ్చితమైన నిబంధనలు పాటించాలని కలెక్టర్ సిరి ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌లు, క్లినిక్‌లు APPCB మార్గదర్శకాల ప్రకారం వ్యర్థాలను వేరుచేసి శాస్త్రీయంగా నిర్వర్తించాలని సూచించారు. 'బయోమెడికల్ వ్యర్థాల యాప్'లో ప్రతిరోజూ డేటా నమోదు తప్పనిసరి అన్నారు. ఉల్లంఘన చేసిన సంస్థలపై చర్యలు చేపట్టాలన్నారు.