VIDEO: జిల్లాలో వడగండ్ల వాన బీభత్సవం

MLG: ములుగు జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టిస్తోంది. వడగండ్లకు పంటలు దెబ్బతింటున్నాయి. సోమవారం సాయంత్రం ఏటూరు నాగారం, మంగపేట మండలాల్లో పలుచోట్ల ఈదురు గాలులతో పాటు వడగండ్లతో వర్షం పడింది. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం తమను నిండా ముంచిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు.