అప్పుఘర్ తీరంలో 6 పీతలు రూ.100

అప్పుఘర్ తీరంలో 6 పీతలు రూ.100

VSP: అప్పుఘర్ సముద్ర తీరంలో ఆదివారం తాజా చేపలతో సందడి వాతావరణం నెలకొంది. పారా పెద్దది రూ.2,300, చిన్నవి ఐదు రూ.300, ఐదు వడగచ్చులు రూ.300, రొయ్యిల వాటా రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక ఆరు పీతలు కేవలం రూ.వందకే లభిస్తుండటంతో కొనుగోలుదారులు ఎగబడుతున్నారు. సముద్రం నుంచి అప్పుడే వచ్చిన తాజా సరకు కావడంతో నగరవాసులు వీటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.