ఈనెల 3 న కలెక్టరేట్‌లో మీకోసం కార్యక్రమం
ప్రకాశం: ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 3న మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మీకోసం కార్యక్రమంలో అర్జీదారులు పాల్గొని తమ సమస్యలను విన్నవించుకోవచ్చని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు, జేసీ గోపాలకృష్ణ పాల్గొంటారని తెలిపారు.