టీడీపీ గూటికి వైసీపీ కౌన్సిలర్లు..!

CTR: ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వ్యూహంతో వైసీపీ కౌన్సిలర్లు ఒక్కొక్కరిగా టీడీపీ గూటికి చేరుతున్నారు. ఈనెల 28న మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నిక జరగనుండగా కుప్పంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. వైసీపీ కౌన్సిలర్లు సయ్యద్ అలీ, గణపతి, అరవింద్ టీడీపీ శిబిరానికి చేరారు. వీరితో పాటు మరో ఇద్దరు కౌన్సిలర్లు సైతం టీడీపీకి మద్దతు పలికేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.