తురిమెర్లలో విద్యార్థులకు మెగా క్విజ్ పోటీలు

తురిమెర్లలో విద్యార్థులకు మెగా క్విజ్ పోటీలు

NLR: దగదర్తి మండలం తురిమెర్ల ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులకు మెగా క్విజ్ పోటీలు నిర్వహించారు. ఆరో తేదీ నుంచి ప్రారంభం కానున్న వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ఈ పోటీలు ఏర్పాటు చేసినట్లు హెడ్ మాస్టర్ గాడి వంశీ చరణ్ తెలిపారు. క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు.