ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే

VZM: విజయనగరం పూల్ బాగ్ కాలనీలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతి రాజు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాడుబడిన కళాశాల భవనాలను, తరగతి గదులను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం భవనాల పునర్నిర్మాణం కోసం అంచనా వ్యయాలను తయారు చేయవలసినదిగా సంబంధిత అధికారులకు సూచించారు.