HPV టీకా అవగాహన బ్యానర్ ఆవిష్కరణ
TPT: గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు 14 సంవత్సరాల బాలికలకు అందించనున్న HPV టీకా అవగాహన బ్యానర్‌ను కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సోమవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ టీకా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డా. బాలకృష్ణ నాయక్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. శాంతకుమారి పాల్గోన్నారు.