గూగుల్ రాకతో సంబరాలు చేసుకొన్న టీడీపీ కార్యకర్తలు
VZM: గూగుల్ సెంటర్ రాకను స్వాగతిస్తూ లక్కవరపుకోట మండల కేంద్రంలో బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. గూగుల్ రాకతో ముందుస్తు దీపావళి చేసుకున్నట్లు పార్టీ కార్యకర్తలు తెలిపారు. థ్యాంక్యూ సీఎం సార్, లోకేష్ సార్ అంటూ నినాదాలతో జనసేన నాయకులు, బీజేపీ పార్టీ కార్యకర్తలు హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ మళ్ళ రామకృష్ణ పాల్గొన్నారు.